Friday 17 May 2019

Valapula Solapula Lyrics - Sri Annamacharya Keerthana

Valapula solapula vasantha vela idi
selavinavvakuve chemarinchi menu

Sirasu vanchakuve siggulu vadakuve
paraga ninnathadu thappaka chuchini
virulu dulupakave vesadappimchukokuve
sirulani vibhuditte sesavettini

Cheyetti yeddukokuve cheri yanapettakuve
chayala natadu ni channulamtini
ayamulu dachakuve atte veragamdakuve
moyanadi sarasamu mohana ni vibhudu

Penaguladakuve biguvu chupakuve
ghana Srivenkatesudu kaugilinchini
anumaninchakuve alamelmangavu neevu
chanavichchi ninnunele sammatihnchi yathadu


వలపుల సొలపుల వసంత వేళ యిది
సెలవి నవ్వకువే చెమరించీ మేను

శిరసు వంచకువే సిగ్గులు పడకువే
పరగ నిన్నతడు తప్పక చూచీని
విరులు దులుపకవే వెసదప్పించుకోకువే
సిరులనీ విభుడిట్టే సేసవెట్టీని

చేయెత్తి యెడ్డుకోకువే చేరి యానపెట్టకువే
చాయల నాతడు నీ చన్నులంటిని
ఆయములు దాచకువే అట్టే వెరగందకువే
మోయనాడీ సరసము మోహాన నీ విభుడు

పెనగులాడకువే బిగువు చూపకువే
ఘన శ్రీవేంకటేశుడు కౌగిలించీని
అనుమానించకువే అలమేల్మంగవు నీవు
చనవిచ్చి నిన్నునేలె సమ్మతించీ యాతడు

2 comments:

  1. Thnak you for sharing, please share a singing video, I will be more helpful, like muddugare yashoda song... Please share

    ReplyDelete
  2. చాల విశేషమైనసాహిత్యం, 25-62015 svbc సంగీతసాహిత్ర్య నృత్య సమ్మేళన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటిగారు పరిచయం చేసిన అధ్భుతమైన అనుభవం.

    ReplyDelete