Sunday, 9 July 2023

Aa Pannula Pali Lyrics- ఆపన్నులపాలి సంకీర్తన

ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్క - తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన

రాగము: శ్రీరాగం


ప: ఆపన్నుల పాలి దైవమాతడే గతి తక్క
ఏ ప్రొద్దును భజియించక నితరుడు మరి కలడా

చ. 1: నిరుపాధిక నిజ బంధుడు నిరతిశయానందుడు
కరి వరదుడితడే కాక ఘనుడధికుడు కలడా

చ. 2: సంతత గుణ సంపన్నుడు సాధులకు బ్రసన్నుడు
అంతర్యామితడే కాక అధికుడు మరి కలడా

చ. 3: పరమాత్ముడు పరమ పురుషుడు పరికింపగ గృపాలుడు
తిరువేంకట విభుడే కాక దేవుడు మరి కలడా


Aa pannula pali daivamadate gati takka 
Ye proddunu bhajiyinchaka nitarudu mari kaladA

Nirupadhika nija bandhudu niratishayanandudu 
kari varaduditade gaka ghanudadhikudu kalada

Santata guna sampannudu sadhulaku prasannudu
antaryamitade gaka adhikudu mari kalada

Paramatmudu parama purushudu parikimpaga krpaludu 
thiruvenkata vibhude gaka devudu mari kalada

No comments:

Post a Comment