Sunday, 6 August 2023

Antabari Pattukore అంటబారి పట్టుకోరే అమ్మలాల Annamayya Sankeerthanalu

అధ్యాత్మ సంకీర్తన
ఆహిరి రాగము

అంటబారి పట్టుకోరే అమ్మలాల యిదె
వెంటబారనీదు నన్ను వెడమాయతురుము

కాగెడుపెరుగుచాడె కవ్వముతో బొడిచి
లేగల దోలుకొని అలిగిపోయీని
రాగతనమున వాడె రాతిరి నారగించడు
ఆగి నన్ను గూడడిగె నయ్యో ఇందాకను

కొలదిగానిపెరుగు కొసరికొసరి పోరి
కలవూరుగాయలెల్ల గలచిపెట్టె
పలుకడు చేతిచట్టి పారవేసి పోయీనదె
చెలగుచు మూటగట్టె జెల్లబో యిందాకను

మట్టుపడకిటు నూరుమారులైనా నారగించు
ఇట్టె యిందరిలోన నిన్నాళ్ళును
వెట్టికి నాకొరకుగా వేంకటేశు డారగించె
యెట్టు నేడాకట ధరియించెనో యిందాకను


Antabari pattukore ammalala yide 
Ventabaranidu nannu vedamayaturumu

Kageduperugucade kavvamuto bodichi 
Legala dolukoni aligipoyini
Ragatanamuna vade ratiri naraginchadu 
Agi nannu gudadige nayyo indakanu

Koladiganiperugu kosarikosari pori 
Kalavurugayalella galachipette
Palukadu cheticatti paravesi poyinade 
Chelaguchu mutagatte jellabo yindakanu

Mattupadakitu nurumarulaina naragincu 
Itte yindarilona ninnallunu
Vettiki nakorakuga venkatesu daraginche 
Yettu nedakata dhariyincheno yindakanu

Anchita punyulakaite అంచిత పుణ్యులకైతే Sankeertana Lyrics

అధ్యాత్మ సంకీర్తన
దేశాక్షి రాగం

అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక
పంచమహాపాతకులభ్రమ వాపవశమా

కాననియజ్ఞానులకు కర్మమే దైవము
ఆనినబద్ధులకు దేహమే దైవము
మాననికాముకులకు మగువలే దైవము
పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా

యేమీ నెఱుగనివారి కింద్రియములు దైవము
దోమటిసంసారి కూరదొర దైవము
తామసులకెల్లాను ధనమే దైవము
పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా

ధన నహంకరులకు తాదానే దైవము
దరిద్రుడైనవానికి దాత దైవము
యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము
పరులముంచినయట్టి భ్రమ బాపవశమా


Anchita punyulakaite hari daivamavugaka
Panchamahapatakulabhrama vapavashama

Kananiyaj~janulaku karmame daivamu 
Aninabaddhulaku dehame daivamu
Mananikamukulaku maguvale daivamu 
Panipatti varivaribhrama manpavashama

Yemi nerruganivari kindriyamulu daivamu 
Domatisamsari kuradora daivamu
Tamasulakellanu dhaname daivamu 
Pamarula battinattibhrama bapavashama

Dhana nahankarulaku tadane daivamu 
Daridrudainavaniki data daivamu
Yiravai maku shrivenkateshude daivamu 
Parulamuncinayatti bhrama bapavashama

Friday, 4 August 2023

Anganalala Manache - Annamayya Keerthana అంగనలాల మనచే నాడించుకొనెగాని

తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన
రాగము: శంకరాభరణం

అంగనలాల మనచే నాడించుకొనెగాని
సంగతెఱిగిననెరజాణ డితడే

వొడలులేనివాని కొక్కడే తండ్రాయగాని
తడయక పురుషోత్తము డితడే
బడబాగ్నిజలధికి బాయకల్లుడాయగాని
వెడలించె నమృతము విష్ణుడితడే

పులిగూడుదిన్నవానిపొం దొక్కటే సేసెగాని
నలువంక లక్ష్మీనాథు డితడే
చలికి గోవరివానివరుస బావాయగాని
పలుదేవతలకెల్ల ప్రాణబంధు డితడే

యెక్కడో గొల్లసతుల కింటిమగడాయగాని
తక్కకవెదకేపరతత్త్వ మితడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీద మమ్ము నేలెగాని
తక్కక వేదముచెప్పేదైవమీతడే


Anganalala manache nadinchukonegani 
Sangaterriginanerajana ditade

Vodalulenivani kokkade tandrayagani 
Tadayaka purusottamu ditade
Badabagnijaladhiki bayakalludayagani 
Vedalinche namrutamu visnuditade

Puligududinnavanipondokkate sesegani 
Naluvanka laksminathu ditade
Chaliki govarivanivarusa bavayagani 
Paludevatalakella pranabandhu ditade

Yekkado gollasatula kintimagadayagani 
Takkakavedakeparatattva mitade
Mikkili Shri Venkatadrimida mammu nelegani 
Takkaka vedamucheppedaivamitade

Thursday, 3 August 2023

Angana Yettundina అంగన యెట్టుండినా అన్నమాచార్య సంకీర్తన

తాళ్లపాక అన్నమాచార్య - అంగన యెట్టుండినా  శృంగార సంకీర్తన
రాగము: రామక్రియ

అంగన యెట్టుండినా నమరుగాక
సంగతే నీకు నాపె సాటికి బెనగను

తనకు బోదైనచోట తగిలి మాటాడకున్న
మనుజుడావాడు పెద్ద మాకు గాక
చనవున బెనగగా సమ్మతించకుండితేను
ఘనత యేది చులకదనమే గాక

చెల్లుబడి గలచోట సిగ్గులు విడువకున్న
బల్లిదుడా వాడూ కడు పందగాక
వెల్లివిరి నవ్వగాను వీడు దోళ్ళాడకున్న
చల్లేటి వలపులేవి సటలింతే కాక

తారుకాణలైన చీట తమకించి కూడకున్న
చేరగ జాణడా గోడచేరుపు గాక
యీ రీతి శ్రీ వేంకటేశ యిట్టె రఘునాథుడవై
కూరిమి గూడితివిది కొత్తలింతే కాక


Angana yettundina namarugaka 
Sangate niku nape satiki benaganu

Tanaku bodainacota tagili matadakunna 
Manujudavadu pedda maku gaka
Chanavuna benagaga sammatincakunditenu 
Ghanata yedi chulakadaname gaka

Chellubadi galacota siggulu viduvakunna 
Balliduda vadu kadu pandagaka
Velliviri navvaganu vidu dolladakunna 
Challeti valapulevi satalinte kaka

Tarukanalaina chita tamakinchi kudakunna 
Cheraga janada godacherupu gaka
Ee riti Sri Venkatesha itte raghunathudavai
Kurimi gudithivi kothalintegaka 

Angana ninnadigi అంగన నిన్నడిగి - Annamacharya Sankeerthana

అంగన నిన్నడిగి శృంగార సంకీర్తన - తాళ్లపాక అన్నమాచార్య 
రాగము : కురంజి


అంగన నిన్నడిగి రమ్మనె నీమాట
సంగతిగ మరుమాట సరి నాన తీవయ్యా

చెలులచే నింతి నీకు చెప్పిపంపిన మాటలు
తలచుకొన్నాడవా దయతో నీవు
తొలుత గాను కంపిన దొడ్డ పూవుల బంతి
లలిమించిన పరిమళము గొంటివా

చాయల నాసతో నాపె సారె జూచిన చూపులు
ఆయములు గరచేనా అంటుకొనెనా
చేయెత్తి సిగ్గుతోడ చేరి మొక్కిన మొక్కులు
ఆయనా నీకు శలవు అందరిలోనా

బెరసి తెరమాటున బెట్టిన నీపై సేసలు
శిరసుపై నిండెనా చిందెనా నీపై
అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
గరిమ నిన్ను గూడి గద్దెపై గూచున్నది


Angana ninnadigi rammane nimata 
Sangatiga marumata sari nana tivayya

Chelulache ninti niku cheppipampina matalu 
Talachukonnadava dayato nivu
Toluta ganu kampina dodda puvula banti 
Laliminchina parimalamu gontiva

Chayala nasato nape sare jucina cupulu 
Ayamulu garacena antukonena
Cheyetti siggutoda cheri mokkina mokkulu 
Ayana niku shalavu andarilona

Berasi teramatuna bettina nipai sesalu 
Shirasupai nindena chindena nipai
Arudai Shri Venkatesha alamelumanga yike 
Garima ninnu gudi gaddepai guchunnadi

Wednesday, 2 August 2023

Angadi Nevvaru Nantakuro - Annamayya Keerthana - అంగడి నెవ్వరు

అంగడి నెవ్వరు - తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన
రాగము: శ్రీరాగం

అంగడి నెవ్వరు నంటకురో యీ దొంగలగూడిన ద్రోహులను

దోసము దోసము తొలరో శ్రీహరి దాసానదాసుల దగ్గరక
ఆసలనాసల హరినెరుగక చెడి వీసరపోయిన వెర్రులము 

పాపము పాపము పాయరో కర్మపు దాపవువారము దగ్గరక
చేపట్టి వేదపు శ్రీహరి కథలు యేపొద్దు విననిహీనులము 

పంకము పంకము పైకొనిరాకురో కొంకుగొసరులకూళలము
వేంకటగిరిపై విభునిపుణ్యకథ లంకెల విననియన్యులము


Angadi nevvaru nantakuro yidongala gudina drohulanu

Dosamu dosamu tolaro shriharidasana dasula daggaraka
Asalanasala harinerugaka chedi visarapoyina verrulamu

Papamu papamu payaro karmapudapavu varamu daggaraka
Chepatti vedapu shrihari kathalu yepoddu vinanihinulamu

Pankamu pankamu paikonirakuro konkugosarulakulalamu
Venkatagiripai vibhunipunyakatha lankela vinaniyanyulamu