Pallavi: |
Itti mudduladi baaludaedavaadu vaani .. |
patti techchi pottanimda paalu boyarae |
Charanam1: |
Gamidai paaridenchi kaagedi vennalalona .. |
chaema poovu kadiyaala cheyipetti |
cheema guttenani thana chekkita kanneeru jaara .. |
vaemaru vaapovuvaani veddu vettarae |
Charanam2: |
Muchchuvale vachchi tana mungamuruvula chaeyi .. |
tachchedi perugulona tagabetti |
nochchenani chaeyideesi noranella jollugaara .. |
vochcheli vaapovuvaani nooradincharae |
Charanam3: |
Eppudu vachcheno maa illu jochchi pettaeloni .. |
chepparaani vungaraala chaeyibetti |
appadaina venkatadri asabaalakudu gaana .. |
tappakunda bettevaani talaketta rae |
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని ..
పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే
కామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన ..
చేమ పూవు కడియాల చేయిపెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార ..
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే
ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి ..
తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార ..
వొచ్చెలి వాపోవువాని నూరడించరే
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టేలోని ..
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటేద్రిఅసవాలకుడు గాన ..
తప్పకుండ బెట్టెవాని తలకెత్త రే
No comments:
Post a Comment