Friday 2 November 2018

Okkade Antharyami - Annamacharya Keerthana Lyrics

Okkade antharyami vupakaari chepattu
thakkinavi yinniyunu thalapu rechedini

Yerugumi jivuda yimdriyalu sommu gavu
guriyai mayalalona gudinche vinthe
maravaku jivuda manasu cuttamu gadu
theragoppa asalane thippedi dinthe

Thelusuko jivuda dehamunu nammaradu
valasithe nundu bovu vannevantidi
thalachuko jivuda dhanamu danicha gadu
palulampatamulace barachedi dinthe

Sammathinchu jivuda samsara mokajada gadu
bimmati poddokajada penachu ninthe
yimmula srivemkatesu ditanimulame yintha
nemmi dane gatiyamte nityamau nimthe


ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు
తక్కినవి యిన్నియును తలపు రేచెడిని

యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు
గుఱియై మాయలలోన గూడించే వింతె
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు
తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె

తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు
వలసితే నుండు బోవు వన్నెవంటిది
తలచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు
పలులంపటములచే బరచెడి దింతె

సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు
బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత
నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే 

Thursday 1 November 2018

Okati Bolichina - Annamacharya Keerthana Lyrics

Okati bolichina verokati tocini
sakalamu bolicemu sudati simgaralu

Kaluvalu jakoralu gamdumilu damaralu
calimutaipu jippalu satikannulu
alalu nilamanulamdhakaramu megamu
nalupu rasivo nalinakshi thurumu

Jakkavalu nimmapamdlu sari buguttulu gomda
lekkuva marimiddelu yimti cannulu
cukkalu suravonnalu sudi vajrala gollu
akkara yenuga tomdalaramtle thodalu

Soga theegelu thundlu sudathi bahuvulide
chega chiguru lathika cheli padalu
yigati srivemkatesa yimti nivuramu mida
baaguga namari paidi patima bolinavi


ఒకటి బోలిచిన వేరొకటి తోచీని
సకలము బోలిచేము సుదతి సింగారాలు

కలువలు జకోరాలు గండుమీలు దామరలు
చలిముతైపు జిప్పలు సతికన్నులు
అలలు నీలమణులంధకారము మేఘము
నలుపు రాశివో నలినాక్షి తురుము

జక్కవలు నిమ్మపండ్లు సరి బూగుత్తులు గొండ
లెక్కువ మరిమిద్దెలు యింతి చన్నులు
చుక్కలు సురవొన్నలు సూది వజ్రాల గోళ్ళు
అక్కర యేనుగ తోండాలరంట్లే తొడలు

సోగ తీగెలు తూండ్లు సుదతి బాహువులిదె
చేగ చిగురు లత్తిక చెలి పాదాలు
యీగతి శ్రీవేంకటేశ యింతి నీవురము మీద
బాగుగ నమరి పైడి పతిమ బోలినవి

Okatikokatiguda Sankeerthana Lyrics by Annamacharya

Okatikokatiguda doyamma niyamde
sakalamu netuvale samtasesitive

Tanaku ni kuchalu damtikumbhala bolite
yi nadumu simhamunela polene
anivatti ni kannu lambujala bolitenu
ananamu chamduruni nadiyela polene

Ativa nichetulu bisamgamula bolitenu
yitavai nadapu hamsanela polene
chaturata nasikamu sampemga jolitenu
tati nikurulu tummedalanela polene

Nevalapu niyaru nilahi bolitenu
yivala menu merupunela polene
sri vemkatesu movi chinni kempulamtimchi
avela damtalu vajralai yettuvolene


ఒకటికొకటిగూడ దోయమ్మ నీయందే
సకలము నెటువలె సంతసేసితివే

తానకు నీ కుచాలు దంతికుంభల బోలితే
యీ నడుము సింహమునేల పోలెనే
అనివట్టి నీ కన్ను లంబుజాల బోలితేను
అననము చందురుని నదియేల పోలెనే

అతివ నీచేతులు బిసాంగముల బోలితేను
యితవై నడపు హంసనేల పోలెనే
చతురత నాసికము సంపెంగ జోలితేను
తతి నీకురులు తుమ్మెదలనేల పోలెనే

నేవళపు నీయారు నీలాహి బోలితేను
యీవల మేను మెరుపునేల పోలెనే
శ్రీ వేంకటేశు మొవి చిన్ని కెంపులంతించి
ఆవేళ దంతాలు వజ్రాలై యెట్టువోలెనే