Sunday 31 October 2021

Enta janaro (ఎంత జాణరో) - Annamacharya Sankeerthana Lyrics

Enta janaro yikaliki
kamtuda ni bogamulake tagunu

Cheli ni kaugita cematalajesenu
chaluvaga nippudu jalakeli
alaruchu gucamula nadumuchu jesenu
palumaru mudamula barvatakeli

Paipai benaguchu bahulatalane
vaipuga jesenu vanakeli
chupula nipayi solayuchu jesenu
pupa vasamtamu puvulakeli

Aruduga nattivi yadharamrutamula
sarijesenu bojanakeli
karaguchu srivemkatesa sesenu
paragina ratulane parinaya keli


ఎంత జాణరో యీకలికి
కాంతుడ నీ భోగములకే తగునూ

చెలి నీ కౌగిట చెమటలజేసెను
చలువగ నిప్పుడు జలకేళి
అలరుచు గుచముల నదుముచు జేసెను
పలుమరు ముదముల బర్వతకేళి

పైపై బెనగుచు బాహులతలనే
వైపుగ జేసెను వనకేళి
చూపుల నీపయి సొలయుచు జేసెను
పూప వసంతము పూవులకేళి

అరుదుగ నట్టివి యధరామృతముల
సరిజేసెను భోజనకేళి
కరగుచు శ్రీవేంకటేశ సేసేను
పరగిన రతులనె పరిణయ కేళి

Saturday 30 October 2021

Emta Chadivi Choochina - ఎంత చదివి చూచిన - Annamacharya Sankeerthana

Emta chadivi choochina neetadae ghanamugaaka
Yimtayu naelaetidaiva mika vaerae kalaraa

Modala jagamulaku moolamainavaadu
Tuda pralayamunaadu tochaevaadu
Kadisi naduma nimdi kaligivumdedivaadu
Madanagurudaekaaka ma~ri vaerae kalaraa

Paramaanuvainavaadu brahmaamdamainavaadu
Suralaku narulaku jotayinavaadu
Paramainavaadu prapamchamainavaadu
Hari yokkadaekaaka avvalanu galaraa

Puttugulayinavaadu bhogamokshaalainavaadu
Yettanedura lonanu yinnitivaadu
Gattigaa Sree Venkataadri kamalaadaevitodi
Pattapudaevudaekaaka parulika galaraa


ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక
యింతయు నేలేటిదైవ మిక వేరే కలరా

మొదల జగములకు మూలమైనవాడు
తుద ప్రళయమునాడు తోచేవాడు
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాడు
మదనగురుడేకాక మఱి వేరే కలరా

పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు
సురలకు నరులకు జోటయినవాడు
పరమైనవాడు ప్రపంచమైనవాడు
హరి యొక్కడేకాక అవ్వలను గలరా

పుట్టుగులయినవాడు భోగమోక్షాలైనవాడు
యెట్టనెదుర లోనను యిన్నిటివాడు
గట్టిగా శ్రీ వేంకటాద్రి కమలాదేవితోడి
పట్టపుదేవుడేకాక పరులిక గలరా

Thursday 28 October 2021

Endaloni Needa Sankeerthana Lyrics - ఎండలోనినీడ యీమనసు

Endaloni needa ee manasu
pandugaya seyabaniledu manasu

Vanachetakamulavalenaya manasu
gonebattina bamkagunamaya manasu
manajikkinakolamatamaya manasu
tenelopali yigaterugaya manasu

Gadirajubadukaya kadaleni manasu
nadividi pesaraya nayamainamanasu
gadakugattina patagatidoche manasu
adasulopali kambamai thochemanasu

Teruvuchupinajada dirugu nimanasu
marugujesinachota marugu nimanasu
tiruVenkatesupai diramaina manasu
sirigaliginachota jeru nee manasu


ఎండలోనినీడ యీమనసు
పండుగాయ సేయబనిలేదు మనసు

వానచేతకములవలెనాయ మనసు
గోనెబట్టిన బంకగుణమాయ మనసు
మానజిక్కినకోలమతమాయ మనసు
తేనెలోపలి యీగతెరుగాయ మనసు

గడిరాజుబదుకాయ కడలేని మనసు
నడివీది పెసరాయ నయమైనమనసు
గడకుగట్టిన పాతగతిదోచె మనసు
అడసులోపలి కంబమై తోచెమనసు

తెరువుచూపినజాడ దిరుగు నీమనసు
మరుగుజేసినచోట మరుగు నీమనసు
తిరువెంకటేశుపై దిరమైన మనసు
సిరిగలిగినచోట జేరు నీమనసు

Avunayya Ni Suddulu - అవునయ్య నీ సుద్దు లటువంటివి

Avunayya ni suddu latu vamtivi
javalito nantu bachhali vamti vadavu

Chelaregi yeda leni chetalella jesivachi
velayu nippudu nannu vedukonevu
palumaru nicheta basalu gona veratu
kaluva kamtula yeda kata rida vanuchu

Vada varipai nella valapula challi vachi
yida nato nedaleni yichhaladevu
kode kada ni voja koniyada nichhitayyi
jadato nimtula yeda camcaluda vanuchu

Pekku gopikala nella bemdladi yita vachi
gakkana na kaugita galasitivi
nikki Sri Venkatesuda ne nalamelmanganu
kakkasincha nopa nivu gabbi vaadavanuchu


అవునయ్య నీ సుద్దు లటు వంటివి
జవళితో నంటు బచ్చలి వంటి వాడవు

చెలరేగి యేడ లేని చేతలెల్లా జేసివచ్చి
వెలయు నిప్పుడు నన్ను వేడుకొనేవు
పలుమారు నీచేత బాసలు గొన వెరతు
కలువ కంటుల యెడ కాత రీడ వనుచు

వాడ వారిపై నెల్లా వలపుల చల్లి వచ్చి
యీడ నాతో నెడలేని యిచ్చలాడేవు
కోడె కాడ నీ వోజ కొనియాడ నిచ్చితయ్యీ
జాడతో నింతుల యెడ చంచలుడ వనుచు

పెక్కు గోపికల నెల్లా బెండ్లాడి యిట వచ్చి
గక్కన నా కౌగిట గలసితివి
నిక్కి శ్రీ వేంకటేశుడ నే నలమేల్మంగను
కక్కసించ నోప నీవు గబ్బి వాడవనుచు 

Wednesday 27 October 2021

Aviye Po Nedu - అవియే పో నేడు Annamcharya Sankeerthana Lyrics

Aviye po nedu matonamti sese tapamulu
vivarimchukoni itte vichcheyi manave

Komdala kottagonala goramaina tapamulu
pamdu balamulaloni pachchimetalu
gumde dake mamtrala kuttikalo jasamulu
domdakarunyana nadu tajesega

Yerulalo munakalu yekkuva acharalu
a riti monamu todi yanamdalu
korikori chalivedi kotikoti nemalu
cheri yi riti dapalu sesinaduga

Sammatimcha jesina yasana bhedabamdhalu
vummadi yanyonyapu yogalu
dommi sri vemkatapati tolli sese natlane
rammani nedunu narati jesega 


అవియే పో నేడు మాతోనంటి సేసే తపములు
వివరించుకొని ఇట్టె విచ్చేయి మనవే

కొండల కొట్టగొనల గోరమైన తపములు
పండు బలములలోని పచ్చిమేతలు
గుండె దాకే మంత్రాల కుత్తికలో జసములు
దొండకారుణ్యాన నాడు తాజేసెగా

యేరులలో మునకలు యెఖ్ఖువ ఆచారాలు
ఆ రీతి మోనము తోడి యానందాలు
కోరికోరి చలివేడి కోటికోటి నేమాలు
చేరి యీ రీతి దపాలు సేసినాడుగా

సమ్మతించ జేసిన యాసన భేదబంధాలు
వుమ్మడి యన్యోన్యపు యోగాలు
దొమ్మి శ్రీ వేంకటపతి తొల్లి సేసె నట్లనె
రమ్మని నేడును నారతి జేసెగా 

Tuesday 26 October 2021

Avi Yatu Bhavinchina - అవి యటు భావించినట్లాను

Avi yatu bavimcinatlanu

kavagoni yimduku galagaru ganulu


Arayaga nebadiyaksharamule po

dharalopala nimdastutulu

sari buranamulu sastravedamulu

yimpuga panniyu nimdi podame


Vokkadehamuna nunnayamgamulu

pekkuvidhamulai berasinivi

cikkula gonniti siggula daturu

yekkuvayatulaku ninniyu samamu


Amtaratmalo namtaryamai

bamtula dirigetibamdhuvulu

cimtimpa natade srivemkatesvaru

dimtaku gartani yemturu budhulu


అవి యటు భావించినట్లాను

కవగొని యిందుకు గలగరు ఘనులు


అరయగ నేబదియక్షరములె పో

ధరలోపల నిందాస్తుతులు

సరి బురాణములు శాస్త్రవేదములు

యింపుగ పన్నియు నిండి పొడమె


వొక్కదేహమున నున్నయంగములు

పెక్కువిధములై బెరసినివి

చిక్కుల గొన్నిటి సిగ్గుల దాతురు

యెక్కువయతులకు నిన్నియు సమము


అంతరాత్మలో నంతర్యామై

బంతుల దిరిగేటిబంధువులు

చింతింప నతడే శ్రీవేంకటేశ్వరు

డింతకు గర్తని యెంతురు బుధులు 

Monday 25 October 2021

Avatharamande Nide - అవతారమందె నిదె అద్దమరేతిరికాడ

Avataramande nide addamaretirikada

bhavaharudu sravanabahulashtamini 


Vasudevudu sesina paratapamuphalamu

pasala devakipali bhagyarekha

desala sajjanulaku tiramaina punyamu

kosarike kamsuni gumdedigulu


Nandagopuni yeduti nammina yaisvaryamu

kamduva yasodaku kanakanidhi

mumdari golletalaku mohapu balajaladhi

samdadi sisupalunisamharamu 


Devatalamunulaku divyamaina paramjyoti

bhavinchudasula vajrapamjaramu

srivenkatadrimida jelage krushnu didivo

davati narakasuru talagumdugamdadu


అవతారమందె నిదె అద్దమరేతిరికాడ

భవహరుఁడు శ్రావణబహుళాష్టమిని


వసుదేవుఁడు సేసిన పరతపముఫలము

పసల దేవకిపాలి భాగ్యరేఖ

దెసల సజ్జనులకు తిరమైన పుణ్యము

కొసరికె కంసుని గుండెదిగులు


నందగోపుని యెదుటి నమ్మిన యైశ్వర్యము

కందువ యశోదకు కనకనిధి

ముందరి గొల్లెతలకు మోహపుఁ బాలజలధి

సందడి శిశుపాలునిసంహారము


దేవతలమునులకు దివ్యమైన పరంజ్యోతి

భావించుదాసుల వజ్రపంజరము

శ్రీవేంకటాద్రిమీఁదఁ జెలఁగే కృష్ణుఁ డిదివో

దావతి నరకాసురు తలగుండుగండఁడు