Tuesday 30 November 2021

Ettayina Jeyumu - Annamayya Keerthana Lyrics

Ettayina jeyumu yika nichittamu
kittina ni samkirtanaparuda

Komdaru jnanulu kondaru bhakthulu
komdaru vairagya kovidulu
yimdarilo ne nevvada ganide
sandadi hari nisaranagatuda

Japitalu gomdaru sastrulu gomdaru
prapatti gomdaru baluvulu
vupaminchaga ninnokada ganimdu
kapurula nidimgarida nenu

Acharyapurushulu avvala gondaru
yechinasamayulai yerpadiri
kacheti Srivemkatapati nenaite
thahci nidasula dasudanu


ఎట్టయినా జేయుము యిక నీచిత్తము
కిట్టిన నీ సంకీర్తనపరుడ

కొందరు జ్ఞానులు కొందరు భక్తులు
కొందరు వైరాగ్య కోవిదులు
యిందరిలో నే నెవ్వడ గానిదె
సందడి హరి నీశరణాగతుడ

జపితలు గొందరు శాస్త్రులు గొందరు
ప్రపత్తి గొందరు బలువులు
వుపమించగ నిన్నొకడా గానిందు
కపురుల నీడింగరీడ నేను

ఆచార్యపురుషులు అవ్వల గొందరు
యేచినసమయులై యేర్పడిరి
కాచేటి శ్రీవేంకటపతి నేనైతే
తాచి నీదాసుల దాసుడను 

Monday 29 November 2021

Etuvanti Valapo - Annamacharya Sankirthana Lyrics

Etuvamti valapo yevvari koladi gadu
gatanato damakinchi ganugonavayya

Talukuna ninnujuchi talavanchukoni yimti
talaposi nirupu tanalonane
niluvu jematatoda nitturupulatoda
chelaregi gubbatili jittagimcavayya

Korinipai nasapadi gobbunanu siggupadi
pera betti mataladi bedavulane
sarapu turumutoda javvanabaramu toda
ariti nivveragamdi nadarinchavayya

Kaugitiki jeyyi chachi kannulane nikumokki
maginamovi yichi matakanane
chegadera ninnugude SriVenkatesuda
vigadalamelu mamga vinodinchavayya

ఎటువంటి వలపో యెవ్వరి కొలది గాదు
ఘటనతో దమకించి గనుగొనవయ్యా

తళుకున నిన్నుజూచి తలవంచుకొని యింతి
తలపోసి నీరూపు తనలోననె
నిలువు జెమటతోడ నిట్టూరుపులతోడ
చెలరేగి గుబ్బతిలీ జిత్తగించవయ్యా

కోరినీపై నాసపడి గొబ్బునను సిగ్గుపడి
పెర బెట్టి మాటలాడీ బెదవులనె
సారపు తురుముతోడ జవ్వనభారము తోడ
ఆరీతి నివ్వెరగందీ నాదరించవయ్యా

కౌగిటికి జెయ్యి చాచి కన్నులనే నీకుమొక్కి
మాగినమోవి యిచ్చీ మతకాననె
చేగదేర నిన్నుగూడె శ్రీవేంకటేశుడ
వీగదలమేలు మంగ వినోదించవయ్యా

Sunday 28 November 2021

Enanayanalachoopu - Annamacharya Sankeerthana Lyrics

Enanayanalachupu lemta sobagaiyumdu
pranasamkatamulagupanulu natlumdu

Edaleniparitapa meriti da numdu
adiyasakorikelu natuvalene yumdu
kadalenidukhasangati yetla danumdu
adarusamsarambu natlane vumdu

Chintaparamparala jittamadi yetlumdu
vamta dolaganimohavasamu natlumdu
mamtanapubanulapayi manasu mari yetlumdu
kamtusaramargamulagati yatla numdu

Devudokka deyanedi telivi dana ketlumdu
SriVenkatesukrupacheta latlumdu
bhavagocharamainaparina tadi yetlumdu
kaivalyasoukhyasamgatulu natlumdu 

ఏణనయనలచూపు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన సాహిత్యం 

ఏణనయనలచూపు లెంత సొబగైయుండు
ప్రాణసంకటములగుపనులు నట్లుండు

ఎడలేనిపరితాప మేరీతి దా నుండు
అడియాసకోరికెలు నటువలెనె యుండు
కడలేనిదు:ఖసంగతి యెట్ల దానుండు
అడరుసంసారంబు నట్లనే వుండు

చింతాపరంపరల జిత్తమది యెట్లుండు
వంత దొలగనిమొహవశము నట్లుండు
మంతనపుబనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గములగతి యట్ల నుండు

దేవుడొక్క డెయనెడి తెలివి దన కెట్లుండు
శ్రీవేంకటేశుక్రుపచేత లట్లుండు
భావగోచరమైనపరిణ తది యెట్లుండు
కైవల్యసొఊఖ్యసంగతులు నట్లుండు

Saturday 27 November 2021

Eda Sujnanameda Thelivi - ఏడ సుజ్ఞానమేడ తెలివి నాకు - శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన

Eda sujnanameda telivi naku
budidalo homamai poya galamu

Ide melayyedi nakade melayyedi nani
kadisiyasache gadavaleka
yeduru chuchi chuchi yelayinchi yelayinchi
podachatu mrugamai poya galamu

Imtata diredi duhkamamtata diredinani
vimtavimta vagalache vegivegi
chintayu vedanala jikkuvaduchu nagni
pontanunna vennayai poya galamu

Yikkada sukhamu naakakkada sukhambani
yekkadikaina nuri kegiyegi
gakkana SriThiruVenkatapathi ganaka
pukkitipuranamayi poya galamu


ఏడ సుజ్ఞానమేడ తెలివి నాకు
బూడిదలో హోమమై పోయ గాలము

ఇదె మేలయ్యెడి నాకదె మేలయ్యెడి నని
కదిసియాసచే గడవలేక
యెదురు చూచిచూచి యెలయించి యెలయించి
పొదచాటు మృగమై పోయ గాలము

ఇంతట దీరెడి దుఃఖమంతట దీరెడినని
వింతవింత వగలచే వేగివేగి
చింతయు వేదనల జిక్కువడుచు నగ్ని
పొంతనున్న వెన్నయై పోయ గాలము

యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని
యెక్కడికైనా నూరి కేగియేగి
గక్కన శ్రీతిరువేంకటపతి గానక
పుక్కిటిపురాణమయి పోయ గాలము

Friday 26 November 2021

Edi Kada Deenikedi Modalu Annamayya Sankeerthana

Edi kada dinikedi modalu vatti
vedanalu tannu viduchu tennadu

Todarinahrudayame todidomgayai
vadigoni tannu valabettaganu
kadagi karmamula gadachu tennadu
nidivibamdhamula nigu tennadu

Tatigonna talapule daivayogamai
matinumdi tannu maraginchaganu
pratileniyapada bayu tennadu
dhrutimalinayasa diru tennadu

Podalinamamataye butamai tannu
bodigoni buddhi bodhinchaganu
kadisi Venkatapati ganuta yennadu
tudilenibavamula dolagu tennadu

ఏది కడ దీనికేది మొదలు వట్టి
వేదనలు తన్ను విడుచు టెన్నడు

తొడరినహృదయమే తోడిదొంగయై
వడిగొని తన్ను వలబెట్టగాను
కడగి కర్మముల గడచు టెన్నడు
నిడివిబంధముల నీగు టెన్నడు

తతిగొన్న తలపులే దైవయోగమై
మతినుండి తన్ను మరగించగాను
ప్రతిలేనియాపద బాయు టెన్నడు
ధృతిమాలినయాస దీరు టెన్నడు

పొదలినమమతయే భూతమై తన్ను
బొదిగొని బుద్ధి బోధించగాను
కదిసి వేంకటపతి గనుట యెన్నడు
తుదిలేనిభవముల దొలగు టెన్నడు 

Thursday 25 November 2021

Endu Bodamitimo - ఎందు బొడమితిమో - Annamacharya Sankeerthana Lyrics

Emdu bodamitimo yerugamu ma
kamduva sriharikarunekaka

Yetijanmamo yeragamu para
metido ne merxagamu
gatapukamalaju gachinayi
natakude manamminavibudu

Yevvaru velpulo yerugamu sura
levvaro ne merugamu
ravvagusri satheeramanudu ma
kavvanajodaru danthariyaami

Yinkanetido yeragamu yi
yamkelabamula nalayamu
jamkela danujula jadipinatiru
Venkatesudu maviduvanivibhudu


ఎందు బొడమితిమో యెఱుగము మా
కందువ శ్రీహరికరుణేకాక

ఏటిజన్మమో యెఱగము పర
మేటిదో నే మెఱగము
గాటపుకమలజు గాచినయీ
నాటకుడే మానమ్మినవిభుడు

యెవ్వారు వేల్పులో యెఱుగము సుర
లెవ్వరో నే మెఱుగము
రవ్వగుశ్రీ సతిరమణుడు మా
కవ్వనజోదరు డంతరియామి

యింకానేటిదో యెఱగము యీ
యంకెలబాముల నలయము
జంకెల దనుజుల జదిపినతిరు
వేంకటేశుడు మావిడువనివిభుడు

Wednesday 24 November 2021

Endu Neeku Priyamo - ఎందు నీకు బ్రియమో - Annamacharya Sankeerthana Lyrics

Endu neeku briyamo yiteppatirunallu
binduvade sirulato theppatirunallu

Palajaladhilo bavvalinchi pamuteppa
delucunna dadi deppatirunallu
voli nekodakamai vokkamarriyakumeeda
theluchunna dadi theppatirunallu

Amrutamu dachhuvadu ambudhilo mandaramu
temala delinchu theppatirunallu
yamunalo kalimgusamgapupadigemida
timiri tokkina theppatirunallu

Appudu padaruvelu amganalacematala
teppala delina teppatirunallu
voppuga SriVenkatadri nunnathi gonetilona
theppirille netaneta theppathirunallu


ఎందు నీకు బ్రియమో యీతెప్పతిరునాళ్ళు
బిందువడె సిరులతో తెప్పతిరునాళ్ళు

పాలజలధిలో బవ్వళించి పాముతెప్ప
దేలుచున్న దది దెప్పతిరునాళ్ళు
వోలి నేకోదకమై వొక్కమఱ్ఱియాకుమీద
తేలుచున్న దది తెప్పతిరునాళ్ళు

అమృతము దచ్చువాడు అంబుధిలో మందరము
తెమల దేలించుతెప్పతిరునాళ్ళు
యమునలో కాళింగుసంగపుపడిగెమీద
తిమిరి తొక్కిన తెప్ప తిరునాళ్ళు

అప్పుడు పదారువేలు అంగనలచెమటల
తెప్పల దేలిన తెప్పతిరునాళ్ళు
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతి గోనేటిలోన
తెప్పిరిల్లె నేటనేట తెప్పతిరునాళ్ళు 

Tuesday 23 November 2021

Endu Juchina - ఎందు జూచిన దనకు - Annamayya Sankeerthana Lyrics

Endu juchina danaku ninniyunu nitlane
kandulenisukhamu kalanaina ledu

Sirulugaliginapalamu chinta boralane kani
soridi samtosha minchukaina ledu
tarunigalapalamu vedanala boralute kani
nerasulenisukamu nimishambu ledu

Tanuvugalapalamu patakamuseyane kani
anuvainapunyambu adi yimta ledu
manasugalapalamu durmatibomdane kani
ghanamanojnanasangatih gontha ledu

Chaduvugaliginapalamu samsayambe kani
sadamalajnanischaya mintha ledu
yidi yerigi thiruvenkateswaruni golichinanu
braduku galugunu bhavamu praanulaku ledu 


ఎందు జూచిన దనకు నిన్నియును నిట్లనే
కందులేనిసుఖము కలనైన లేదు

సిరులుగలిగినఫలము చింత బొరలనె కాని
సొరిది సంతోష మించుకైన లేదు
తరుణిగలఫలము వేదనల బొరలుటె కాని
నెరసులేనిసుఖము నిమిషంబు లేదు

తనువుగలఫలము పాతకముసేయనె కాని
అనువైనపుణ్యంబు అది యింత లేదు
మనసుగలఫలము దుర్మతిబొందనే కాని
ఘనమనోజ్ఞానసంగతి గొంత లేదు

చదువుగలిగినఫలము సంశయంబే కాని
సదమలజ్ఞాననిశ్చయ మింత లేదు
యిది యెరిగి తిరువేంకటేశ్వరుని గొలిచినను
బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు

Monday 22 November 2021

Endaaka Nechitta - ఎందాక నేచిత్త మేతలపో - Annamacharya Keerthana Lyrics

Endaaka nechitta methalapo
mundumundu vesarithi muligi vesarithi

Emisethu nedachottu nemani bodhinthunu
namata vinadide naviharamu
yemarina dalapinchi nemaina gadinchi
samusesi vesaarithi jadisi vesaarithi

Yeda chuttaleda pomdulevvaru
todainavaru garu domgalu garu
kuducheeraganichotai koraganipatai
vadivadi vesariti vadili vesaarithi

Yenduna nunnademisesi nekkada bhoginchini
vimdulakuvimdayina venkatesudu
yimdari hrudayamulo niravai yunnadatadu
chendinannu gachugaka chenaki vesaarithi


ఎందాక నేచిత్త మేతలపో
ముందుముందు వేసారితి ములిగి వేసరితి

ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును
నామాట వినదిదే నావిహారము
యేమరినా దలపించీ నేమైనా గడించీ
సాముసేసి వేసారితీ జడిసి వేసారితి 

యేడ చుట్టాలేడ పొందులెవ్వరూ
తోడైనవారు గారు దొంగలు గారు
కూడుచీరగానిచోటై కొరగానిపాటై
వాడివాడి వేసారితి వదిలి వేసారితి

యెందున నున్నాడేమిసేసీ నెక్కడ భోగించీని
విందులకువిందయిన వేంకటేశుడు
యిందరి హృదయములో నిరవై యున్నాడతడు
చెందినన్ను గాచుగాక చెనకి వేసారితి 

Sunday 21 November 2021

Endaraina Galaru - ఎందరైన గలరు - అన్నమాచార్య సంకీర్తన

Endaraina galaru nee kimdrachandraadisuralu
amdurlo ne nevvada nee vaadarimchae detto

Pekku brahmaandamulu neepenuromakoopamula
gikkirisunna vamdokakeetama naenu
chakkagaa jeevaraasulasamdadi badunnavaada
ikkuva nannu dalachi yettu mannimchaevo

Kotulainavaedamulu konaadee ninnamdulo naa
notivinnapamu lokka nuvvu gimjamtae
maatalu naeraka ko~ramaali vaakita numda
baatagaa needaya naapai baarutetto

Achchapuneedaasulu anamtamu vaaralaku
richhala ne nokapaadaraenuva nimtae
ichhaginchi SriVenkatesa ninnu dalachuka
machhika gaachiti nannu maravanidetto


ఎందరైన గలరు నీ కింద్రచంద్రాదిసురలు
అందుర్లో నే నెవ్వడ నీ వాదరించే దెట్టో

పెక్కుబ్రహ్మాండములు నీపెనురోమకూపముల
గిక్కిరిశున్న వందొకకీటమ నేను
చక్కగా జీవరాసులసందడి బడున్నవాడ
ఇక్కువ నన్ను దలచి యెట్టు మన్నించేవో

కోటులైనవేదములు కొనాడీ నిన్నందులో నా
నోటివిన్నపము లొక్క నువ్వు గింజంతే
మాటలు నేరక కొఱమాలి వాకిట నుండ
బాటగా నీదయ నాపై బారుటెట్టో

అచ్చపునీదాసులు అనంతము వారలకు
రిచ్చల నే నొకపాదరేణువ నింతే
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్ను దలచుక
మచ్చిక గాచితి నన్ను మఱవనిదెట్టో

Saturday 20 November 2021

Endaru Sathulo Endaru Suthulo - ఎందరు సతులో యెందరు సుతులో

Endaru sathulo yemdaru suthulo
yimdu namdu netlerige nenu

Malayuchu nayabimanamulani ne
kelana nipudu vedake namte
paluyonulalo palumaru bodamina
chalamari na toli janmambulanu

Garimela bani grahanamu sesina
sirula chelula galane nante
tarunula gurutula talapuna marachiti
paragina bahu kalpambula yamdu

Sri Venkatagiri cheluvuni yaajhnala
bavinchiye kari chaikonti
tavula judaga tagilina korkula
bhavaratula bembadi manasandu


ఎందరు సతులో యెందరు సుతులో
యిందు నందు నెట్లెరిగే నేను

మలయుచు నాయభిమానములని నే
కెలన నిపుడు వెదకే నంటే
పలుయోనులలో పలుమారు బొడమిన
చలమరి నా తొలి జన్మంబులను

గరిమెల బాణి గ్రహణము సేసిన
సిరుల చెలుల గలనే నంటే
తరుణుల గురుతుల తలపున మరచితి
పరగిన బహు కల్పంబుల యందు

శ్రీ వేంకటగిరి చెలువుని యాజ్ఞల
భావించియె కరి చైకొంటి
తావుల జూడగ తగిలిన కోర్కుల
భావరతుల బెంబడి మనసందు 

Friday 19 November 2021

Endariventa Netla - Annamacharya Sankeerthana lyrics - ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు

Endariventa netla dirugavachhu
kamduverxigi cheekatidavvukonugaka

Talarayigaga nemdariki mokkedini
telivimalinayattidehi
koladimirina devakotlu danalona
kalavani nokkanine koluchugaka

Kalichapadaga nekkadiki negedivi
palumalina yattiprani
melimijagamulu menilo galavadu
palitivadai pranutikekkugaka

Nuremdla nemdari nutiyimpagalavadu
cheradaavuleni jeevi
Sriramanudu SriVenkatesuni
korike dalachi mukti kollagonutagaka


ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు
కందువెఱిగి చీకటిదవ్వుకొనుగాక

తలరాయిగాగ నెందరికి మొక్కెడిని
తెలివిమాలినయట్టిదేహి
కొలదిమీరిన దేవకోట్లు దనలోన
కలవాని నొక్కనినే కొలుచుగాక

కాలీచపడగ నెక్కడికి నేగెడివి
పాలుమాలిన యట్టిప్రాణి
మేలిమిజగములు మేనిలో గలవాడు
పాలిటివాడై ప్రణుతికెక్కుగాక

నూరేండ్ల నెందరి నుతియింపగలవాడు
చేరదావులేని జీవి
శ్రీరమణుడు శ్రీవేంకటేశుని
కోరికె దలచి ముక్తి కొల్లగొనుటగాక

Thursday 18 November 2021

Endaritho Benagenu - ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను

Endarito benagenu yekkadani poralaenu
kandarpa janaka neevae gatigaaka maaku

Nikki naabalavamtaana naenae gelichenante
nokkapamchaemdriyamula kopagalanaa
takkinasamsaaravaardi daatagalano mari
dikkula karmabamdhamu temchivaeyagalano

Pannukonnapaayamuna paramu saadhimchenantae
yenna neemaaya kuttara miyyagalanaa
vannelanaamanasae panchukogalano mari
kannatti eeprapanchame kadavagagalano

Vullamulo ninnu dhyaana mogi naejaesaenamtae
tholliti ajhnaanamu thoyagalanaa
illidae Sri Venkataesa yedutanae neeku mokki
balliduda naudugaaka pamda nae gaagalana


ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను
కందర్ప జనక నీవే గతిగాక మాకు

నిక్కి నాబలవంతాన నేనే గెలిచేనంటే
నొక్కపంచేంద్రియముల కోపగలనా
తక్కినసంసారవార్ది దాటగలనో మరి
దిక్కుల కర్మబంధము తెంచివేయగలనో

పన్నుకొన్నపాయమున పరము సాధించేనంటే
యెన్న నీమాయ కుత్తర మియ్యగలనా
వన్నెలనామనసే పంచుకోగలనో మరి
కన్నట్టి యీప్రపంచమే కడవగగలనో

వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేజేసేనంటే
తొల్లిటియజ్ఞానము తోయగలనా
ఇల్లిదే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి
బల్లిదుడ నౌదుగాక పంద నే గాగలనా

Wednesday 17 November 2021

Entaina Dolagavai - ఎంతైన దొలగవై - శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన

Emtaina dolagavai tedaina naamathiki
vinthachavinetuga vishayabuddhi

Enasi janmamula ne netlanumdina boka
venaka diruguduvuga vishamabuddhi
anuvaina yanubavana lanubavinchagajesi
venaka marrapimtuga vishayabuddhi

Kerali kamtalu nenu ginisinanu bolayaluka
virichi kalapuduvuga vishayabuddhi
taritoda vavivartanadalamchinanannu
verapu delupuduvuga vishayabudhi

Yedaleniyapadala netluvoralina nannu
vidichipovaitiga vishayabuddhi
sadibetti vemkatasvamikrupache ninnu
vidipimchavalanega vishayabuddhi

ఎంతైన దొలగవై తేదైన నామతికి
వింతచవినేతుగా విషయబుద్ధి

ఎనసి జన్మముల నే నెట్లనుండిన బోక
వెనక దిరుగుదువుగా విషమబుద్ధి
అనువైన యనుభవన లనుభవించగజేసి
వెనక మఱపింతుగా విషయబుద్ధి

కెఱలి కాంతలు నేను గినిసినను బొలయలుక
విఱిచి కలపుదువుగా విషయబుద్ధి
తఱితోడ వావివర్తనదలంచిననన్ను
వెఱపు దెలుపుదువుగా విషయబుధి

యెడలేనియాపదల నెట్లువొరలిన నన్ను
విడిచిపోవైతిగా విషయబుద్ధి
సడిబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను
విడిపించవలనెగా విషయబుద్ధి

Tuesday 16 November 2021

Entasesina Nedayake Poya - Annamacharya Sankeerthana Lyrics - ఎంతసేసినా నెడయకే పోయ

Emtasesina nedayake poya
munthaloni neeta munigilechuta

Uttipai cheralata murabottulakudu
pattuchalanikomma bahunayakamu
vettimoparilagu verrivoyinapoka
nattimtivairambu nagubatubraduku

Rakapokalacheta raginabenubumdu
vakulenivaramu valavanivalapu
yekalamu vemkatesunikrupaleka
akadikada nadayadedinadapu


ఎంతసేసినా నెడయకే పోయ
ముంతలోనినీట మునిగిలేచుట

ఉట్టిపై చెరలాట మూరబొత్తులకూడు
పట్టుచాలనికొమ్మ బహునాయకము
వెట్టిమోపరిలాగు వెర్రివోయినపోక
నట్టింటివైరంబు నగుబాటుబ్రదుకు

రాకపోకలచేత రాగినబెనుబుండు
వాకులేనివరము వలవనివలపు
యేకాలము వేంకటేశునికృపలేక
ఆకడీకడ నడయాడెడినడపు 

Monday 15 November 2021

Enthaseyagaledu - Annamacharya Sankeerthana - ఎంతసేయగలేదు Lyrics

Entaseyagaledu yituvamtividhi yabavu
namtavanini bikshamadugukona jese

Koricamdruni batti gurutalpaguni jese
kurimalaraga nimdru godi jese
gorakuduvaga drisamkuni namtyajuni jese
virudagunalu batti virupujese

Ativanodduga judamada dharmaju jese
satinammukona harischandru jese
kutilapada sudrakuni gorxrxemuchhuga jese
matimali kururaju madugachorajese

Padanipatla barachi brahmatala vojese
todari kalunukalu duniyajese
adara nividhiki vidhiyagu vemkatesukrupa
padayakumdaga bamgapadakaporadu


ఎంతసేయగలేదు యిటువంటివిధి యభవు
నంతవానిని భిక్షమడుగుకొన జేసె

కోరిచంద్రుని బట్టి గురుతల్పగుని జేసె
కూరిమలరగ నింద్రు గోడి జేసె
ఘోరకుడువగ ద్రిశంకుని నంత్యజుని జేసె
వీరుడగునలు బట్టి విరూపుజేసె

అతివనొడ్డుగ జూదమాడ ధర్మజు జేసె
సతినమ్ముకొన హరిశ్చంద్రు జేసె
కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగ జేసె
మతిమాలి కురురాజు మడుగచొరజేసె

పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోజేసె
తొడరి కాలునుకాలు దునియజేసె
అడర నీవిధికి విధియగు వేంకటేశుకృప
పడయకుండగ భంగపడకపోరాదు

Sunday 14 November 2021

Entha Vicharinchukonna - ఎంతవిచారించుకొన్నా నిదియే - Annamayya Sankeerthana Lyrics

Enthavicharinchukonna nidiye tattvamu hari
vamtuku nikrupagalavade yerugu hari

Ninnunamminattivadu nikilavamdyudu hari
ninnunollanattivadu nirasadhamudu
munnudevatalu nikumokki badikiri hari
vunnati nasuralu ninnollaka chediri hari

Yepuna niperitivadinnita dhanyudu hari
niperollanivadu nirbagyude hari
kaipulaninnu nutimci geliche naradudu hari
paipai ninnuditti sisupaludu vigenu hari

Yitte nivichhinavaramennadu jedadu hari
gattiga niviyyanivi kapatamule hari
atte Sri Venkatesa nivantharangudavu hari
vuttipadi kanakunna dehiki hari


ఎంతవిచారించుకొన్నా నిదియే తత్త్వము హరి
వంతుకు నీకృపగలవాడే యెరుగు హరి

నిన్నునమ్మినట్టివాడు నిఖిలవంద్యుడు హరి
నిన్నునొల్లనట్టివాడు నీరసాధముడు
మున్నుదేవతలు నీకుమొక్కి బదికిరి హరి
వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి

యేపున నీపేరిటివాడిన్నిట ధన్యుడు హరి
నీపేరొల్లనివాడు నిర్భాగ్యుడే హరి
కైపులనిన్ను నుతించి గెలిచె నారదుడు హరి
పైపై నిన్నుదిట్టి శిశుపాలుడు వీగెను హరి

యిట్టె నీవిచ్చినవరమెన్నడు జెడదు హరి
గట్టిగా నీవియ్యనివి కపటములే హరి
అట్టె శ్రీ వేంకటేశ నీవంతరంగుడవు హరి
వుట్టిపడి కానకున్న దేహికి హరి

Saturday 13 November 2021

Enthamohamo - ఎంతమోహమో అన్నమాచార్య సంకీర్తన

Enthamohamo niki inthi meedanu
vimta vimta vedukala midanu

Tarunigubbalu niku dalagada billaluga
noragu konnadavu vubbuna nivu
doravai payyedakomgu domatera baguga
saruga matuka sesuka janavai vunnadavu

Bamini todalu niku pattemanchamu laguna
namukoni pavvalinche vappati nivu
gomutoda pattucheera kuchhela varapugaga
kaminchi itte kodekadavai vunnadavu

Vanita kagili niku vasana chapparamuga
nuniku sesu kunnada voddikai nivu
yenasitivi Sri Venkatesa yalamelumanganu
anisamu simgararayadavai vunnadavu


ఎంతమోహమో నీకీ ఇంతి మీదను
వింత వింత వేడుకల మీదను

తరుణిగుబ్బలు నీకు దలగడ బిల్లలుగా
నొరగు కొన్నాడవు వుబ్బున నీవు
దొరవై పయ్యెదకొంగు దోమతెర బాగుగ
సరుగ మాటుక సేసుక జాణవై వున్నాడవు

భామిని తొడలు నీకు పట్టెమంచము లాగున
నాముకొని పవ్వళించే వప్పటి నీవు
గోముతోడ పట్టుచీర కుచ్చెల వరపుగాగ
కామించి ఇట్టె కోడెకడవై వున్నాడవు

వనిత కాగిలి నీకు వాసన చప్పరముగ
నునికు సేసు కున్నాడ వొద్దికై నీవు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేలుమంగను
అనిశము సింగారరాయడవై వున్నాడవు

Friday 12 November 2021

Entha Papa Karma Maya - ఎంతపాపకర్మమాయ - Annamacharya Keerthanas

Enta papakarmamaya yentavinthachintalaya
vintavaritodipondu vesataya daivama

Chudajuda gottalaya chuttamokadu ledaya
vidubattu aluchaya veduka ludivoyanu
jodujodu gudadaya chokkudanamu manadaya
yedakeda thalapota yenthasese daivama

Niruleniyeru datanera demtelotaya
meravella nidadaya meti jeradayanu
toramaina asalubbi tova ganipinchadaya
kori rakapokacheta kollaboya galamu

Thallidandri datha guruvu taneyainanachari
vallabumdu naku meluvamtidaya janmamu
kallagadu Venkatesughanuni padaseva naku
mollamaya namanasu modamaya daivama


ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ
వింతవారితోడిపొందు వేసటాయ దైవమా

చూడజూడ గొత్తలాయ చుట్టమొకడు లేడాయ
వీడుబట్టు అలుచాయ వేడుక లుడివోయను
జోడుజోడు గూడదాయ చొక్కుదనము మానదాయ
యేడకేడ తలపోత యెంతసేసె దైవమా

నీరులేనియేరు దాటనేర దెంతేలోతాయ
మేరవెళ్ళ నీదడాయ మేటి జేరడాయను
తోరమైన ఆసలుబ్బి తోవ గానిపించదాయ
కోరి రాకపోకచేత కొల్లబోయ గాలము

తల్లిదండ్రి దాత గురువు తానెయైననాచారి
వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము
కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు
మొల్లమాయ నామనసు మోదమాయ దైవమా 

Thursday 11 November 2021

Enta Nerchene - ఎంతనేర్చెనే ఈ కలికి - Annamayya Sankeerthana Lyrics

Emta nerchene ee kaliki
intula ketake intesi pagatu

Chalamula nerapuchu savatula duruchu
saligela porali javaralu
cheluvuni solayuchu chetulu chapuchu
kelapula nagavula keralini

Satiki penaguchu sanaguchu ralchuchu
nituna murisi nerajana
matala guniyuchu madamuna morayuchu
jutudanambula juchini

Mamtana maduchu malayuchu navvuchu
pamtamu ladi pasaladi
intalo SriVenkatesudu nannele
pontanumdi nanu pogadini

ఎంతనేర్చెనే ఈ కలికి
ఇంతుల కేటకే ఇంతేసి పగటు

చలముల నెరపుచు సవతుల దూరుచు
సలిగెల పొరలీ జవరాలు
చెలువుని సొలయుచు చేతులు చాపుచు
కెలపుల నగవుల కెరలీని

సాటికి పెనగుచు సణగుచు రాల్చుచు
నీటున మురిసీ నెరజాణ
మాటల గునియుచు మదమున మొరయుచు
జూటుదనంబుల జూచీని

మంతన మాడుచు మలయుచు నవ్వుచు
పంతము లాడీ పసలాడీ
ఇంతలో శ్రీవేంకటేశుడు నన్నేలె
పొంతనుండి నను పొగడీని 

Wednesday 10 November 2021

Enthati Vadavu Ninnemani - ఎంతటి వాడవు నిన్నేమని - Sankeerthana Lyrics

Emtati vadavu ninnemani nutintunu
vimtalu nikamara kumdaga vicharinche

Pala samudramulonam bavvalinchi yunde niku
balumdavai tenevenna batayena
kalamellanu srikamta kaugita numda niku
gollavaite gollatalam guda vedukayena

Parama padamunamdu brahmamai vumde
perigee repallevada priyamayena
suralanella gavaga sulabumdavaina niku
garimetoda pasulakavaga vedukaye

Ye proddu muktula nenasi vumde niku
gopalurato gudumda korikayena
bapure yalamelmamgapati Sri Venkateswara
ye proddu nitti leelale hithavayena 


ఎంతటి వాడవు నిన్నేమని నుతింతును
వింతలు నీకమర కుండగ విచారించే

పాల సముద్రములోనం బవ్వళించి యుండే నీకు
బాలుండవై తేనెవెన్న బాతాయెనా
కాలమెల్లను శ్రీకాంత కౌగిట నుండ నీకు
గొల్లవైతే గొల్లతలం గూడ వేడుకాయెనా

పరమ పదమునందు బ్రహ్మమై వుండే
పెరిగీ రేపల్లెవాడ ప్రియమాయెనా
సురలనెల్ల గావగ సులభుండవైన నీకు
గరిమెతోడ పసులకావగ వేడుకాయె

ఏ ప్రొద్దు ముక్తుల నెనసి వుండే నీకు
గోపాలురతో గూడుండ కోరికాయెనా
బాపురె యలమేల్మంగపతి శ్రీ వేంకటేశ్వర
యే ప్రొద్దు నిట్టి లీలలే హితవాయెనా

Tuesday 9 November 2021

Entha Chesina - ఎంతచేసిన తనకేది తుద

Entachesina tanakedi tuda
chinta sriharipai jikkute chalu

Edapaka punyalenni chesina
gadame kakika gadayedi
tadabada hariye daivamanuchu madi
viduvakavumdina verave chalu

Yennitapamulivi yetlajesina
annuva kadhikamu alavedi
vannela galagaka vanajakshunipai
vunna chittamadi vokkate chalu

Yindari vadamulella gelichina
kamde gakika garimedi
yindarinelina yi Vemkatapati
ponduga mahimala podave chalu


ఎంతచేసిన తనకేది తుద
చింత శ్రీహరిపై జిక్కుటే చాలు

ఎడపక పుణ్యాలెన్ని చేసినా
గడమే కాకిక గడయేది
తడబడ హరియే దైవమనుచు మది
విడువకవుండిన వెరవే చాలు

యెన్నితపములివి యెట్లజేసినా
అన్నువ కధికము అలవేది
వన్నెల గలగక వనజాక్షునిపై
వున్న చిత్తమది వొక్కటే చాలు

యిందరి వాదములెల్ల గెలిచినా
కందే గాకిక గరిమేది
యిందరినేలిన యీవేంకటపతి
పొందుగ మహిమల పొడవే చాలు

Monday 8 November 2021

Entha Chuttamo Sankeerthana Lyrics - ఎంతచుట్టమో నీకునిదివో

Emtachuttamo neekunidivo aape
santhasapu valapula jadisi naape

Thenegare pedavula thetamataladi naape
nanabetti selavula navvinape
sanabettina chupulu jaripimchi nipainanape
monamuto dommulanu mokkinape

Nimdujekkutaddamula nidalu chupinape
gamdu dummida kopputogadiminape
komdalavamti channulakonalu dakimchi naape
memdujiguruchetula mechchu mechchi naape

Ayapu merugu mena asalurechi naape
payapu siggulacheta bhramimchi naape
moyarani pirudula muripemu chusinaape
yi yeda srivemkatesa yenase ninnaape


ఎంతచుట్టమో నీకునిదివో ఆపె
సంతసపు వలపుల జడిసీ నాపె

తేనెగారే పెదవుల తేటమాటలాడీ నాపె
నానబెట్టి సెలవుల నవ్వీనాపె
సానబెట్టిన చూపులు జరిపించీ నీపైనానాపె
మోనముతో దొమ్ములను మొక్కినాపె

నిండుజెక్కుటద్దముల నీడలు చూపీనాపె
గండు దుమ్మిద కొప్పుతోగదిమీనాపె
కొండలవంటి చన్నులకొనలు దాకించీ నాపె
మెండుజిగురుచేతుల మెచ్చు మెచ్చీ నాపె

ఆయపు మెఋగు మేన ఆసలురేచీ నాపె
పాయపు సిగ్గులచేత భ్రమించీ నాపె
మోయరాని పిరుదుల మురిపెము చూసీనాపె
యీ యెడ శ్రీవేంకటేశ యెనసె నిన్నాపె 

Saturday 6 November 2021

Enta vanikokani (ఎంత వనికోకాని) - Annamacharya Sankeerthana Lyrics

Emta vanikokani yeruganenu
chentane telusuko nejeppiti ni suddulu

Vadale jaru durumu vaipuga muduchu komta
kadalu gannula chupu kadi paraga
madamuvalene pemjematalu chekkulagara
vedaki nevvato ninnu vidula vidulanu

Adachi channulapai bayyada bigyinchukomta
kadaleni nitturpulu kadumaganu
tadabada bedavula tammabemtlu ralaga
adigi ni vunnachotu amganala nellanu

Vukkumiri karamula vodimida bettukoni
mikkili ni kapepomdu mi dettaga
ikkada srivemkatesa yitu nannu gudevu
chokkuchu ni meda dikke chuchi danadivo

ఎంత వనికోకాని యెఋగనేను
చెంతనే తెలుసుకో నేజెప్పితి నీ సుద్దులు

వదలే జారు దురుము వైపుగా ముడుచు కొంటా
కదలు గన్నుల చూపు కాడి పారగా
మదమువలెనే పెంజెమటలు చెక్కులగార
వెదకీ నెవ్వతో నిన్ను వీదుల వీదులను

అడచి చన్నులపై బయ్యద బిగిఇంచుకొంటా
కడలేని నిట్టూర్పులు కడుమగాను
తడబడ బెదవుల తమ్మబేంట్లు రాలగా
అడిగీ నీ వున్నచోటు అంగనల నెల్లాను

వుక్కుమీరి కరముల వొడిమీద బెట్టుకొని
మిక్కిలి నీ కాపెపొందు మీ దెత్తగా
ఇక్కడ శ్రీవేంకటేశ యిటు నన్ను గూడేవు
చొక్కుచు నీ మేడ దిక్కే చూచీ దానదివో

Enta Ledu - ఎంత లేదు చిత్తమా శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన

Emta ledu chittama yitalela mothalela
vamtulaku baranela vagarinchanela

Dakkanivi goranela tattumuttu padanela
chikki namtake samtasimca rada
okkamate vuppudini vupadapa mamdanela
chakka juda daginamte chavi gonarada

Pari pari veda nela badalika padanela
miridaina michhinante mechharada
viridai podavekki viruga badaganela
cheri yumdinamtake chechacharada

Jivulugoluvanela silugula badanela
SriVenkatesudathma jikki vumdaga
daavathi padaganela dappula boralanela
kaivasamainanduke gathi guda rada


ఎంత లేదు చిత్తమా యీతలేల మోతలేల
వంతులకు బారనేల వగరించనేలా

దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల
చిక్కి నంతకే సంతసించ రాదా
ఒక్కమాటే వుప్పుదిని వుపదాప మందనేల
చక్క జూడ దగినంతే చవి గొనరాదా

పారి పారి వేడ నేల బడలిక పడనేల
మీరిదైన మిచ్చినంతే మెచ్చరాదా
వీరిడై పొడవెక్కి విరుగ బడగనేల
చేరి యుండినంతకే చేచాచరాదా

జీవులుగొలువనేల సిలుగుల బడనేల
శ్రీవేంకటేశుడాత్మ జిక్కి వుండగా
దావతి పడగనేల దప్పుల బొరలనేల
కైవశమైనందుకే గతి గూడ రాదా 

Friday 5 November 2021

Entha Midu Katteno - Sri Annamacharya Sankeerthana Lyrics - ఎంత మీదు కట్టెనో

Emta midu katteno yimti niku javvanamu
kamtudavemi sesito kanukalampe celi

Niddarimcavalasina ni kaugitane kani
vodda ninnu basi vomtinolladu cheli
koddiga matadinanu kori nitone kani
muddarinchi parulato mosame cheli

Aragimchavalasina atu ni pottunagani
vurake vereyaite nolladu cheli
saare videmichinanu sagamaku nikiyyaka
cheri vere tammulamu cheyadu cheli

Komma payyada gappina guda nitogani
vummadi danamtanaite nolladu cheli
yimmula Sri Venkatesa yinthalo gudithigani
bammara vettinaa neeku baayadu cheli


ఎంత మీదు కట్టెనో యింతి నీకు జవ్వనము
కాంతుడవేమి సేసితో కానుకలంపె చెలి

నిద్దరించవలసినా నీ కౌగిటనే కాని
వొద్ద నిన్ను బాసి వొంటినొల్లదు చెలి
కొద్దిగా మాటాడినాను కోరి నీతోనే కాని
ముద్దరించి పరులతో మోసమే చెలి

ఆరగించవలసినా అటు నీ పొత్తునగాని
వూరకే వేరెయైతే నొల్లదు చెలి
సారె విడెమిచ్చినాను సగమాకు నీకియ్యక
చేరి వేరే తమ్ములము చేయదు చెలి

కొమ్మ పయ్యద గప్పినా గూడ నీతోగాని
వుమ్మడి దనంతనైతే నొల్లదు చెలి
యిమ్ముల శ్రీ వేంకటేశ యింతలో గూడితిగాని
బమ్మర వెట్టినా నీకు బాయదు చెలి 

Thursday 4 November 2021

Entha Manumanna - ఎంత మానుమన్న - అన్నమయ్య సంకీర్తన

Enta manumanna jimtalela manune
pamtapumanasu haripai numtegaka

Tiranibamdhalu nede tegumamte nelategu
barapumamata bedabasinagaka
vurataga mamata nenollanamte nelamanu
voruputo lampatamu lollakumtegaka

Vekapugopamu nede vidumamte nelavidu
tokachichhayinayasa dunchinagaka
akata nanelamanu annitanu yimdariki
makupadi thathharamu marachuntegaka

Pettanidi daivamitte pettumamte nelapettu
yitte vemkatapati yichhinagaka
yittunittu nitadu danimdariki nelayichhu
vottinavirakti nemi nollakuntegaka


ఎంత మానుమన్న జింతలేల మానునే
పంతపుమనసు హరిపై నుంటేగాక

తీరనిబంధాలు నేడే తెగుమంటే నేలతెగు
భారపుమమత బెడబాసినగాక
వూరటగా మమత నేనొల్లనంటే నేలమాను
వోరుపుతో లంపటము లొల్లకుంటేగాక

వేకపుగోపము నేడే విడుమంటే నేలవిడు
తోకచిచ్చయినయాస దుంచినగాక
ఆకట నానేలమాను అన్నిటాను యిందరికి
మాకుపడి తత్తరము మరచుంటేగాక

పెట్టనిది దైవమిట్టే పెట్టుమంటె నేలపెట్టు
యిట్టే వేంకటపతి యిచ్చినగాక
యిట్టునిట్టు నీతడు దానిందరికి నేలయిచ్చు
వొట్టినవిరక్తి నేమీ నొల్లకుంటేగాక

Wednesday 3 November 2021

Entha Bhakthavatsaluda - ఎంత భక్తవత్సలుడ - Annamayya Sankeerthana Lyrics

Emta baktavatsaluda vittundavalada
vimtalu nisuddulella vinabote nittive

Yila nasurariyaneyibirudu celle niku
balivibishanadulapalike celladu
kelasi avule nivu gelutu vemdarinaina
talachi chuda nidasula koduduvu

Imdarapalitikini yisvaruda velikavu
pamdavai yarjunubamdibamta vaitivi
vamdanaku naule devatalake doravu
amdapunidasulaku nannita dasudavu

Kadupulo lokamukanna thandri vinnitanu
kodukavu devakiki gorinanthane
tadavite vedamulu tagile brahmamavu
viduvanimaakaithe Sri Vemkatadripathivi


ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా
వింతలు నీసుద్దులెల్లా వినబోతే నిట్టివే

యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు
బలివిభీషణాదులపాలికే చెల్లదు
కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా
తలచి చూడ నీదాసుల కోడుదువు

ఇందరపాలిటికిని యీశ్వరుడ వేలికవు
పందవై యర్జునుబండిబంట వైతివి
వందనకు నౌలే దేవతలకే దొరవు
అందపునీదాసులకు నన్నిటా దాసుడవు

కడుపులో లోకముకన్నతండ్రి విన్నిటాను
కొడుకవు దేవకికి గోరినంతనే
తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు
విడువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి 

Tuesday 2 November 2021

Entha Bodinchi - ఎంత బోధించి - Annamayya Keerthana Lyrics

Entha bodhinchi yemisesina dana
dontikarmamulu tolagini

Satataduracharajadunaku bunyasam
gati dalaposina galigina
atipapakarmabodhakudai velayudushtu
mati dalaposina mari kaligina

Bahujivahimsaparudainavaniki
yihaparamulu daiva michini
vihitakarmamuluvidichinavaniki
sahajacharamu jarigina

Devadushakudai thirigetivaniki
devatamtaramu delisina
srivemkatesvaru jimtimpakundina
pavanamatiyai bratikina


ఎంత బోధించి యేమిసేసిన దన
దొంతికర్మములు తొలగీనీ

సతతదురాచారజడునకు బుణ్యసం
గతి దలపోసిన గలిగీనా
అతిపాపకర్మబోధకుడై వెలయుదుష్టు
మతి దలపోసిన మరి కలిగీనా

బహుజీవహింసాపరుడైనవానికి
యిహపరములు దైవ మిచ్చీనీ
విహితకర్మములువిడిచినవానికి
సహజాచారము జరిగీనా

దేవదూషకుడై తిరిగేటివానికి
దేవతాంతరము దెలిసీనా
శ్రీవేంకటేశ్వరు జింతింపకుండిన
పావనమతియై బ్రతికీనా

Monday 1 November 2021

Enta Bapana - Annamayya Sankeerthana - ఎంత బాపనా సోద మింత గలదా

Enta bapana soda minta galadaa
Antayu neemahimae haribhatloo

Sooribha tlokavamka choranichotlu chochchi
Vaarabiyya metti yetti vadadaaki
Neeruvattugoni bhoomi neellellaa vaaraattee
Kaerikaeri nagaayyaa krishnabhatloo

Devarojjha lokavamka dikkulalo bolagoodu
Deevenatho naaragimchi teevumarigi
Yeevala bettinavaari kaemainaa nosageeni
Vaevaelamaayalavishnubhatloo

Somayaadu lokavamka soridi suralakellaa-
Naamanito vimduvettee nanudinamu
Homapuviprulasommu lodisi taa buchhukoni
Vaemaru sreevaemkataadrivennubhatloo


ఎంత బాపనా సోద మింత గలదా
అంతయు నీమహిమే హరిభట్లూ

సూరిభ ట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి
వారబియ్య మెత్తి యెత్తి వడదాకి
నీరువట్టుగొని భూమి నీళ్లెల్లా వారాట్టీ
కేరికేరి నగాయ్యా క్రిష్ణభట్లూ

దేవరొజ్ఝ లొకవంక దిక్కులలో బొలగూడు
దీవెనతో నారగించి తీవుమరిగి
యీవల బెట్టినవారి కేమైనా నొసగీని
వేవేలమాయలవిష్ణుభట్లూ

సోమయాదు లొకవంక సొరిది సురలకెల్లా-
నామనితో విందువెట్టీ ననుదినము
హోమపువిప్రులసొమ్ము లొడిసి తా బుచ్చుకొనీ
వేమరు శ్రీవేంకటాద్రివెన్నుభట్లూ