Raagam: Lalitha
Baludai repalle lopala
nalariyatale yadene yitadu
Nelatala sannapu nennudullapai
nelayintalarati nilu gatti
kelapula nunu jankenalane
kalayucu nalari bomma pendladene yitadu
Gubbala merugula gurugula lopala
nubbanana balogi ninci
obbidi ga bedavulane namalucu
nabbina yatale yadene yitadu
Eppudu nituvale nindlu gattuka
kappuragandula galayucunu
theppala delucu diruvenkatagiri
yappudu mahimala nadene yitadu
బాలుఁడై రేపల్లె లోపల - అన్నమాచార్య శృంగార సంకీర్తన
రాగము: లలిత
బాలుఁడై రేపల్లె లోపల
నాలరి యాటలె యాడెనే యితఁడు
నెలఁతల సన్నపు నెన్నుదుళ్లపై
నెలయింతలరతి నిలు గట్టి
కెలపుల నును జంకెనలనె కలయుచు
నలరి బొమ్మ పెండ్లాడెనె యితఁడు
గుబ్బల మెఱుఁగుల గురుగులలోపల
నుబ్బనానఁబాలొగి నించి
ఒబ్బిడి గాఁ బెదవులనే నమలుచు
నబ్బిన యాటలె యాడెనే యితఁడు
ఎప్పుడు నిటువలె నిండ్లు గట్టుక
కప్పుర గందులఁ గలయుచునూ
తెప్పలఁ దేలుచుఁ దిరువేంకటగిరి
యప్పఁడు మహిమల నాడెనె యితఁడు
No comments:
Post a Comment