Pallavi : |
Meluko …meluko…ooo…melukoo |
Meluko srungara raaya meti madana gopala |
melukove maa paali minchina nidaanamaa… |
Charanam1 : |
Sandadinche gopikala javvana vanamulona |
kanduva tirige mada gajamavu |
indumukhi satyabhama hruda padmamuloni |
gandham mariginatti gandu thummeda |
Charanam2 : |
Gatigudi rukhmini kougiti panjaramulo |
ratimuddu guliketi raachiluka |
satulu padaaruvela janta kannu kaluvalaku |
ithavai podamina naa indubimbamaa |
Charanam3 : |
Varusa kolaniloni vaari channu kondalapai |
nirati vaalina naa neela meghama |
sirinuramuna mochi sri venkatadri meeda |
garima varaalichhe kalpa tharuvaa |
Wednesday 30 May 2012
Meluko, Meluko Srungara Raya Annamacharya Keerthana Lyrics
Subscribe to:
Post Comments (Atom)
పల్లవి:
ReplyDeleteమేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
చరణం 1:
సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు..2
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద..2
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
చరణం 2:
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా..2
సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమ..2
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
చరణం 3:
వరుసంగొలనిలోని వారి చన్నుఁగొండలపై
నిరతివాలిన నా నీలమేఘమా..2
శిరనురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా..2
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల