Tuesday 12 June 2018

Madamatsaramu Leka - Annamacharya Samkirtanalu

Madamatsaramu leka manasu pedaipo 
padarina yasalavadavo vaishnavudu

ittunattu dirigadi yemaina jedanadi 
pettaramta boyaramta bekkuladi
yettivarinaina duri yevvarinaina jeri 
vattiyasala badanivaduvo vaishnavudu

gadanakoraku jikki kamukividyala jokki 
nidivi nemaina gani nikki nikki
vodaligunamutoda vuduta vidyala jala 
vadadaki badalanivadavo vaishnavudu

avala vorula jedanadaga vinivini 
cevamira yevvarini jedanadaka
kovidu srivemkatesu golici peddalakrupa 
vanivartanala vaduvo vaishnavudu


|| మదమత్సరము లేక మనసుపేదైపో | పదరినయాసలవాడవో వైష్ణవుడు ||

|| ఇట్టునట్టు దిరిగాడి యేమైనా జెడనాడి | పెట్టరంటా బోయరంటా బెక్కులాడి |
యెట్టివారినైనా దూరి యెవ్వరినైన జేరి | వట్టియాసల బడనివాడువో వైష్ణవుడు ||

|| గడనకొరకు జిక్కి కాముకివిద్యల జొక్కి | నిడివి నేమైనా గని నిక్కి నిక్కి |
వొడలిగుణముతోడ వుదుటువిద్యల జాల | వడదాకి బడలనివాడవో వైష్ణవుడు ||

|| ఆవల వొరుల జెడనాడగ వినివిని | చేవమీరి యెవ్వరిని జెడనాడక |
కోవిదు శ్రీవేంకటేశు గొలిచి పెద్దలకృప | వావివర్తనగలవాడువో వైష్ణవుడు ||

No comments:

Post a Comment