Keerthana : Aakashamaddama
Ragam : Bhupala
Aakasha maddama avvalayu naddama
shrikantu bhajiyincu sevakulaku
Pathala maddama balimadhana dasulaku
butalam baddama punyulaku
setu kailasamulu cira bhumulanniyunu
paitrovalata parama bhavatulakunu
Amaraava thaddama hari dasulaku maha-
thimiramu laddama divyulakunu
kamalasananuni lokambadiyu naddama
vimalathmulai velugu vishnudasulaku
Paramapada maddama brahmanda dhanudaina
dhara Venkateswaruni dasulakunu
yiravaina lokamula ninnita bhoginchi
varusalanu viharinchu vara vaishnavulaku
తాళ్లపాక అన్నమాచార్య
రాగము : భూపాళం
ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమా
శ్రీకాంతు భజియించు సేవకులకు
పాతాళ మడ్డమా బలిమథను దాసులకు
భూతలం బడ్డమా పుణ్యులకును
సేతుకైలాసములు చిరభూములిన్నియును
పై త్రోవలట పరమ భాగవతులకును
అమరావ తడ్డమా హరిదాసులకు మహా-
తిమిరంబు లడ్డమా దివ్యులకును
కమలాసనుని లోకంబదియు నడ్డమా
విమలాత్ములై వెలుఁగు విష్ణుదాసులకు
పరమపద మడ్డమా బ్రహ్మాండధరుఁడైన
ధర వేంకటేశ్వరుని దాసులకును
యిరవైన లోకముల నిన్నిటా భోగించి
వరుసలను విహరించు వరవైష్ణవులకు
No comments:
Post a Comment