Badi badi tirigadi balakrusnudu
yedayani jaanagade ee balakrusnudu
Chokkuchu soluchuvachi sudatulu ettukunte
pakkana navvulu navvi balakrusnudu
ikkuvaku cheyichachi edanaina tongichuchi
ekkudu gamidikada i balakrusnudu
Channulanti sare sare caviga mudduluvetti
pannikade mohamella balakrusnudu
sannalane mokku mokki sammatipai edadisi
ennesi nercinade balakrusnudu
Nindukagita ninci nerupulu pacharinchi
pandu mataladikade balakrusnudu
andane shrivenkatadri nyayamerigi takude
endanida kannulato balakrusnudu
బడి బడి తిరిగాడీ బాలకృష్ణుడు
ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు
చొక్కుచు సోలుచువచ్చి సుదతులు ఎత్తుకుంటే
పక్కన నవ్వులు నవ్వీ బాలకృష్ణుడు
ఇక్కువకూ చేయిచాచి ఏడనైన తొంగిచూచి
ఎక్కుడు గామిడికద ఈ బాలకృష్ణుడు
చన్నులంటి సారె సారె చవిగా ముద్దులువెట్టి
పన్నీకదే మోహమెల్ల బాలకృష్ణుడు
సన్నలనే మొక్కు మొక్కి సమ్మతిపై ఎదదీసి
ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు
నిండుకాగిట నించి నేరుపులు పచరించీ
పండు మాటలాడీకదే బాలకృష్ణుడు
అండనే శ్రీవేంకటాద్రి న్యాయమెరిగి తాకూడే
ఎండనీడ కన్నులతో బాలకృష్ణుడు
No comments:
Post a Comment