Taruni ni yaluka kenthatidi inthi nivela
karuninchagadara venkatasaila naatha
karuninchagadara venkatasaila naatha
Okamaru samsaramolla bommani talachu
okamaru vidhi sethaluhinchi pogadu
okamaru thanujuchi vurake thalavuchu
okamaru harshamuna nondi memarachu
Ninujuchi okamaru niluvella pulakinchu
thanujuchi okamaru thalaposi nagunu
kanuderachi ninujuchi kadu siggubadi nilichi
yinniyunu thalaposi yinthalo marachu
Vadalaina molanulu gadiyinchu nokamaru
chedarina kurulella cheragu nokamaru
adanerigi Thiruvenkata dhisa pondithivi
chadurudavu ninu baaya jaladokamaru
తరుణి నీ యలుక కెంతటి దింతినీ వేళ
కరుణించఁ గదర వేంకటశైలనాథా
ఒకమారు సంసారమొల్లఁ బొమ్మని తలఁచు
ఒక మారు విధిసేఁతలూహించి పొగడు
ఒక మారు తనుఁజూచి వూరకే తలవూఁచు
నొకమారు హర్షమున నొంది మేమఱచు
నిన్నుఁ జూచి వొకమారు నిలువెల్ల పులకించు
తన్నుఁజూచి వొకమారు తలపోసి నగును
కన్నుదెరచి నినుఁజూచి కడు సిగ్గువడి నిలిచి
యిన్నియును తలపోసి యింతలో మఱచు
వదలైన మొలనూలు గదియించు నొకమారు
చెదరిన కురులెల్ల చెరుగునొకమారు
అదనెరిఁగి తిరువేంకటాధీశ పొందితివి
చదురుఁడవు నినుఁ బాయఁ జాలదొక మారు
No comments:
Post a Comment