Sunday 5 March 2017

Achyuta Mimmu Dalache - Annamacharya Keerthana Lyrics

achyuta mimmu dalache yamtapani valena
yichchala mivare maku nihaparaliyyaga

mimmu neriginayatti midasula nerige
sammati vijnaname chalada maku
vummadi miseva sesukumdeti vaishnuvula
sammukhana sevimchute chalada naku

nirati niku mokketinidimgarilaku
saravito mokkute chalada naku
paraga ninnu pujimche prapannulapujimche
sarileni bhagyamu chalada naku

amdi niku bhaktulaina yalamahanubhavula
chamdapu varipai bhakti chalada naku
kamduva srivenkatesa kadu nibamtubamtuku
samdadi bamtanavute chalada naku


అచ్యుత మిమ్ముదలచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరాలియ్యగా

మిమ్ము నెఱిగినయట్టి మీదాసుల నెఱిగే
సమ్మతి విజ్ఞానమే చాలదా మాకు
వుమ్మడి మీసేవ సేసుకుండేటి వైష్ణువుల
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు

నిరతి నీకు మొక్కేటినీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్ను పూజించే ప్రపన్నులపూజించే
సరిలేని భాగ్యము చాలదా నాకు

అంది నీకు భక్తులైన యలమహానుభావుల
చందపు వారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీబంటుబంటుకు
సందడి బంటనవుటే చాలదా నాకు

Achyutu Saraname Annamayya Keerthana Lyrics

achyutu saraname annitikini guri
hechchukumdumari yemchaganedi

yonijanakamagu yodalidi
yenelavaina neti kulamu
tanunu malamutrapu jelama
nanacharamu nadichina

papapunyamula bratukidi
yepoddu mokshambetuvale doraku
dipana badhala dinamulivi
chupatti vedakaga sukhamimdedi

marigina teruvala manasuyidi
saravinenna vijnanambedi
yiravuga srivemkateswarude
veravani kamte velitikanedi


అచ్యుతు శరణమే ఆన్నిటికిని గురి
హెచ్చుకుందుమరి యెంచగనేది

యోనిజనకమగు యొడలిది
యేనెలవైన నేటి కులము
తానును మలమూత్రపు జెలమ
నానాచారము నడిచీనా

పాపపుణ్యముల బ్రతుకిది
యేపొద్దు మోక్షంబెటువలె దొరకు
దీపన బాధల దినములివి
చూపట్టి వెదకగ సుఖమిందేది

మరిగిన తెరువల మనసుయిది
సరవినెన్న విజ్ఞానంబేది
యిరవుగ శ్రీవేంకటేశ్వరుడే
వెరవని కంటే వెలితికనేది

Adaramma Padaramma Annamacharya Keerthana Lyrics

adaramma padaramma amdaru miru
veduka samtasambulu velliviriyayanu

kamalanabhudu putte kamsuni madamanacha
timiri devaki devi dehamamdu
amarulaku munulakabhayamichche nitadu
komare golletalapai korikalu nilipe

reyipagaluga chesi repalle perugujochche
ayeda navula gache nadimulamu
yi yeda lokalu chupe nitte tanakadupulo
mayasesi yimdarilo manujudainiliche

balalilalu natimchi bahudaivikamu mimche
paluvennalu domgile paramamurti
talibhubharamanache dharmamu paripalimche
melimi srivemkatadri mida nitte niliche



ఆడరమ్మా పాడారమ్మా అందరు మీరు
వేడుక సంతసంబులు వెల్లివిరియాయను

కమలనాభుడు పుట్టె కంసుని మదమణచ
తిమిరి దేవకి దేవి దేహమందు
అమరులకు మునులకభయమిచ్చె నితడు
కొమరె గొల్లెతలపై కోరికలు నిలిపె

రేయిపగలుగ చేసి రేపల్లె పెరుగుజొచ్చె
ఆయెడా నావుల గాచె నాదిమూలము
యీ యెడ లోకాలు చూపె నిట్టే తనకడుపులో
మాయసేసి యిందరిలో మనుజుడైనిలిచె

బాలలీలలు నటించి బహుదైవికము మించె
పాలువెన్నలు దొంగిలె పరమమూర్తి
తాళిభూభారమణచె ధర్మము పరిపాలించె
మేలిమి శ్రీవేంకటాద్రి మీద నిట్టె నిలిచె