Tuesday 10 July 2018

Mayapu Danujula - Annamacharya Keerthanalu

Mayapu danujula madavairi kapi-
rayadu vidivo ramunibantu

Pettinajamgayu pempumigula mola
gattinakaseyu garvamuna
nittanilici puninaceta nadimi-
ditta viduvo devunibamtu

Navvuchu lamkanagarapudanujula-
kovvanacina kapikumjarudu
muvvuruvelpula modalibutiyagu-
ravvagu sitaramanunibamtu

Pankajasambhavu pattamu gattaganu
vumkinchina tanavodayanice
pomkapu kalasapura hanumamtudu
venkataramanuni vedukabamtu


ప|| మాయపుదనుజుల మదవైరి కపి- | రాయడు వీడివో రామునిబంటు ||

చ|| పెట్టినజంగయు పెంపుమిగుల మొల | గట్టినకాసెయు గర్వమున |
నిట్టనిలిచి పూనినచేత నడిమి- | దిట్ట వీడువో దేవునిబంటు ||

చ|| నవ్వుచు లంకానగరపుదనుజుల- | కొవ్వణచిన కపికుంజరుడు |
మువ్వురువేల్పుల మొదలిభూతియగు- | రవ్వగు సీతారమణునిబంటు ||

చ|| పంకజసంభవుపట్టముగట్టగను | వుంకించిన తనవొడయనిచే |
పొంకపు కలశాపుర హనుమంతుడు | వేంకటరమణునివేడుకబంటు ||

Monday 2 July 2018

Malasi Judaro Magasimhamu - Annamayya Sankeerthana

Malasi judaro magasimhamu   
alavi meerina maayala simhamu

Adivo chudaro adima purushuni 
peda yaubalamu meedi penusimhamu
vediki brahmadulu vedantatatulu 
kadisi kanaga leni ghanasimhamu

Mechi mechi chudaro mithimeerinayatti 
chicharakantitodi jigisimhamu
tachina vaaridhiloni tarunikaugitajerchi 
nachina golla sri narasimhamu

Binkamuna judaro piriteeyaka nedu 
ankapudanuja samhaara simhamu
venkatanagamupai vedachalamupai 
kinkaleka vadi berigina simhamu

Sunday 1 July 2018

Madrusanam - Annamacharya Keerthana

Maadrusanam bhavamaya dehinam
yidrusam jnanamiti ye pi na vadanti

vachama gocharam vancha sarvatra
neecha krutyaireva nibidi kruta
kechidepi va vishnukirtanam pritya
suchayamtho va srothum na samti

kutila durbhodhanam kuhakm sarvatra
vitavidambana meva vedmyadhitam
patuvimalamargasambhavanam parasusukam
gatayitum kashtakalikale na samti

duritamidameva jamtunam sarvatra
virasakrutyaireva visadikrutam
paramatmanam bhavyavemkatanama-
girivaram bhajayitum keva na samti


మాదృశానాం భవామయ దేహినాం
యీదృశం జ్నానమితి యే పి న వదంతి

వాచామ గోచరం వాంఛా సర్వత్ర
నీచ కృత్యైరేవ నిబిడీ కృతా
కేచిదేపి వా విష్ణుకీర్తనం ప్రీత్యా
సూచయంతో వా శ్రోతుం న సంతి

కుటిల దుర్భోధనం కూహక్ం సర్వత్ర
వితవిడంబన మేవ వేద్మ్యధీతం
పటువిమలమార్గసంభావనం పరసుసుఖం
ఘతయితుం కష్టకలికాలే న సంతి

దురితమిదమేవ జంతూనాం సర్వత్ర
విరసకృత్యైరేవ విశదీకృతం
పరమాత్మానం భవ్యవేంకటనామ-
గిరివరం భజయితుం కేవా న సంతి

Maa Kella Raajaanumado Dharma Yidi Nee


Ma kella rajanumado dharma yidi ni-
yigaḍam galuguḍa kemarudu

alagaruḍagamana mahishayanaṁbunu
kalisi niyaṁde kaligenaḍa
polasinababamum bunyamu narulagu
yelami galuguḍagu nemarudu

yide niḍagannu yemḍagannu mari
kadisi niyaṁde kaligenaḍa
sadarabunarulagu jananamaraṇamulu
yedurane kaluguḍa kemarudu

shrigaṁta ogadesa bhugamta ogadesa kadena
kaigoni nigidu galigenada
yigada shrivemkadesha yihabaramu
yegamai ma kagu temarudu

మా కెల్ల 'రాజానుమతో ధర్మ' యిది నీ-
యీకడఁ గలుగుట కేమరుదు

అలగరుడగమన మహిశయనంబును
కలిసి నీయందె కలిగెనటా
పొలసినపాపముఁ బుణ్యము నరులకు
యెలమి గలుగుటకు నేమరుదు

యిదె నీడకన్ను యెండకన్ను మరి
కదిసి నీయందె కలిగెనట
సదరపునరులకు జననమరణములు
యెదురనె కలుగుట కేమరుదు

శ్రీకాంత ఒకదెస భూకాంత ఒకదెస కదెన
కైకొని నీకిటు గలిగెనట
యీకడ శ్రీవేంకటేశ యిహపరము
యేకమై మా కగు టేమరుదు